విసారణై తో చాలా నేర్చుకున్నాం - ధనుష్

  • IndiaGlitz, [Friday,December 16 2016]

2017 ఆస్కార్ అవార్డ్స్ కు గాను ఇండియా త‌రుపున వెట్రీమార‌న్ తెర‌కెక్కించిన త‌మిళ చిత్రం విసార‌ణై ను ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వండ‌ర్ బార్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ధ‌నుష్ నిర్మించారు. విదేశీ కేట‌గిరిలో భార‌త్ త‌రుపున 29 చిత్రాలు పోటీప‌డ‌గా ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేసారు. అయితే.. విదేశీ కేట‌గిరిలో 80 సినిమాల‌కు పైగా పోటీప‌డ్డాయి. వీటిలోంచి 9 సినిమాల‌ను ప‌రిశీల‌న‌కు పంపించ‌గా ఈ 9 సినిమాల జాబితాలో విసార‌ణై కు చోటు ద‌క్క‌లేదు.
ఈ సంద‌ర్భంగా హీరో ధ‌నుష్ ఫేస్ బుక్ లో స్పందిస్తూ...ఇండియా త‌రుపున రిప్ర‌జెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా విష‌యాలు తెలుసుకున్నాం. మాకు విషెస్ తెలియ‌చేసిన ప్ర‌తి ఒక్క‌రి థ్యాంక్స్ అంటూ విసార‌ణై ఆస్కార్ బ‌రి నుంచి త‌ప్పుకున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు ధ‌నుష్.