ధన్‌శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం1 చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ధన్‌శ్రీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్.ఎస్. మూర్తి స్వీయ దర్శకత్వంలో.. అల్లు వంశీ, షిప్రాగౌర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరువుకుంది. ఈ చిత్రానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు.
అనంతరం రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మూర్తి. మంచి కంటెంట్ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో నిర్మాతగా, దర్శకుడుగా మారి ఈ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యానిమేషన్ తరహా చిత్రం కావున అందరికీ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆశిస్తున్నా...’’ అన్నారు.
ఈ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు అయిన ఎన్.ఎస్. మూర్తి మాట్లాడుతూ.. ‘‘యానిమేషన్ రంగంలో అనుభవాన్ని సంపాదించిన తర్వాతే ఈ బ్యానర్‌ను స్థాపించి.. కొత్తవాళ్లకు అవకాశం ఇస్తూ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాను. ఇంతవరకూ తెలుగులో అంతగా ఉపయోగించని 2డి, 3డి మరియు మోషన్ క్యాప్చర్ విధానాలతో లైవ్ కమ్ యానిమేషన్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. అందుకు సరిపోయే మంచి కథను తయారు చేసుకొని.. స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి ఈ సినిమాను ప్రారంభించడం జరిగింది. 3 షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి అయ్యేలా ప్లాన్ చేశాము. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం..’’ అని అన్నారు.
హీరో అల్లు వంశీ మాట్లాడుతూ.. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నాము. ప్రేక్షకులకు నచ్చుతుంది. నాకు కూడా ఈ చిత్రం లిఫ్ట్ అవుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.
హీరోయిన్ షిప్రాగౌర్ మాట్లాడుతూ.. ‘‘స్టోరీ విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యా... షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. ఈ నెల 24న వైజాగ్‌లో షూట్ ప్రారంభించనున్నారు’’ అని చెప్పారు.
మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిల్మ్‌తో డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది అన్నారు సంగీత దర్శకుడు జి.జె కార్తికేయన్.
అల్లు వంశీ, షిప్రాగౌర్, సోనీ అగర్వాల్, సాయి, ఛత్రపతి రాజశేఖర్, అల్లు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: కె. బుజ్జి, మ్యూజిక్: జి.జె. కార్తీకేయన్, మేకప్: ప్రసాద్, కాస్ట్యూమ్స్: కుమార్, ఆర్ట్: బలరాం, ఎగ్జిక్యూటివ్ మ్యానేజర్: బి. గణేష్, కో-డైరెక్టర్స్: శంతన్ గద్వాల్, రాంకీ, నిర్మాత- కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: ఎన్. ఎస్. మూర్తి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com