దేవిశ్రీ ప్రసాద్ చిత్రంతో..ధనరాజ్ ఏ పాత్ర అయినా బాగా చేస్తాడనే మంచి పేరొస్తుంది - ధనరాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యశ్వంత్ మూవీస్ సమర్పణలో, ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్నచిత్రం 'దేవిశ్రీప్రసాద్'. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ..
ధనరాజ్ మాట్లాడుతూ "ఈ సి నిమాలో హీరోయిన్ పూజా రామచంద్రన్ మెయిన్ రోల్ చేసింది. నేను, భూపాల్, మనోజ్ నందం..ముగ్గురం ప్రధాన పాత్రల్లో నటించాం. దేవి అనే పాత్రలో భూపాల్, ప్రసాద్ పాత్రలో మనోజ్ నందం నటిస్తే, నేను శ్రీ అనే పా త్రలో కనపడతాను. పూజా రామచంద్రన్ కంటే ముందు దాదాపు పదమూడు మంది హీరోయిన్స్‌ను కలిసి కథ చెబితే..వాళ్లు నటించమని చెప్పేశారు.
కానీ పూజా రామచంద్రన్‌కథ వినగానే యాక్ట్ చేయడానికి అంగీకరించింది. సినిమాలో పూజా రామచంద్రన్ పేరు లీలా రామచంద్రన్. తను ఇందులో సినిమాలో హీరోయిన్గా నటించింది. సినిమా అంతా ఆరు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ మధ్య సినిమా ప్రీమియర్ చూసిన తరుణ్, ప్రిన్స్ తదితరులు సినిమాను వ్యక్తిగతంగా ప్రమోట్ చేస్తామని చెప్పారు. సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో చేశాం.
నా క్యాఎక్టర్ విషయానికి వస్తే.. నాది మార్చురీ వ్యాన్ డ్రైవర్‌గా కనపడతాను. సినిమా టీజర్, ట్రైలర్ చూసిన వారందరూ ఇదొక వల్గర్ సినిమా, శవాన్ని రేప్ చేయడం ఏంటి? అని అన్నారు. కానీ సినిమా చూస్తే వల్గారిటీ ఎక్కడా కనపడదు. ఇది యూత్ సినిమాయే.. కానీ బూతు సినిమా కాదు.
దర్శకుడు శ్రీకిషోర్ చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాడు. తను లేకుండా ఈ సినిమాను ఊహించలేం. సినిమాను 15-20 రోజుల్లో పర్ఫెక్ట్ ప్లానిం గ్‌తో తెరకెక్కించేశాడు. ఎనభై శాతం సినిమా మార్చురీ గదిలోనే షూట్ చేశారు. ముందు వేర్వేరు టైటిల్స్ అనుకున్ననప్పటికీ..చివరకు దేవిశ్రీ ప్రసాద్ టైటిల్ అయితే బావుంటుందని దాన్నే పెట్టాం. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌గారి పేరు పెట్టుకున్న తర్వాత మా సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగని మేమెక్కడా ఆయన పేరుని మిస్ యూజ్ చేయలేదు. ఈ శుక్రవారం నేను నటించిన 'లండన్ బాబులు', 'దేవిశ్రీప్రసాద్' సినిమాలు విడుదలవుతున్నాయి. లండన్ బాబులు చిత్రంలో నాది ఎమోషనల్ పాత్ర. అలాగే..దేవిశ్రీ ప్రసాద్ చిత్రం చూస్తే, ధనరాజ్ ఏ పాత్ర అయినా చేస్తాడని పేరొస్తుంది" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments