Dhanam Nagender:దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
"కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలి. స్పీకర్ సైతం కచ్చితంగా పరిశీలిస్తాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. మరి ఈరోజు రాళ్ల తోటి కొట్టి చంపుతారా..? నేను అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు? దానం నాగేందర్ పంజాగుట్ట బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడని విమర్శలు చేసిన మీరు ఎందుకు తీసుకున్నారు?
బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన అతడు కచ్చితంగా డిస్‌క్వాలిఫై కాబోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. దానం నాగేందర్ చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బాగా నవ్వుతున్నారు. మీరు కొట్టారు మేము తీసుకున్నాము. మేము కొట్టినప్పుడు మీకు లేవకుండా పోతావ్. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. తిరిగి నాలుగు అడుగు ముందుకు దూసుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేం గేట్లు తెరిస్తే మొత్తం వస్తారు అంటున్నారు. మేమింకా గేట్లు తెరవలేదు.. మేము గేట్లు తెరిస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది" అని కౌశిక్‌రెడ్డి వెల్లడించారు.
కాగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో దానంపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com