ఈనెల 31న వస్తున్న 'ధనలక్ష్మి తలుపు తడితే'
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో సాయి అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ధనరాజ్, మనోజ్‌నందం, అనిల్ కళ్యాణ్, విజయసాయి, రణధీర్, శ్రీముఖి, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్ ముఖ్య తారాగణంగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ధనలక్ష్మి తలుపు తడితే` చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
బోలే శావలి సంగీత సారధ్యంలో రూపొంది మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియోకు విశేషమైన స్పందన వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు.
ఈ వేడుకలో యువ కథానాయకుడు సందీప్ కిషన్, సీనియర్ నటు నరేష్, తెలంగాణ సాంస్కృతిక శాఖాధిపతి రసమయి బాలకిషన్, ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త గొట్టిముక్కల పద్మారావు, అంబికా కృష్ణ, నిర్మాత మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రముఖ నిర్మాత వల్లూరి రమేష్, పద్మిని తదితరులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ చిత్రంలోని పాటలను ప్రదర్శించారు. ఎంతో ఇష్టంగా కష్టపడి, అత్యంత బాధ్యతాయుతంగా నిర్మించిన ధనలక్ష్మి తలుపు తడితే` చిత్రం అందరినీ అమితంగా అలరిస్తుందని, ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్ క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చిందని.. ఈనెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు.
చిన్న చిత్రంగా విడుదవుతున్న ధనలక్ష్మి తలుపు తడితే` పెద్ద విజయం సాధించి.. ఈ చిత్రంతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరి ఇంటి తలుపు ధనలక్ష్మి తట్టాలని అతిథులంతా అభిలషించారు. ధనలక్ష్మి తలుపు తడితే` అద్భుతంగా రూపొందిందని.. కచ్చితంగా వంద రోజులాడుతుందని నేను చెప్పను. కానీ.. విడుదలైన అన్ని ధియేటర్లలో రెండో వారం కొనసాగుతుందని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగను` అన్నారు నటుడు,నిర్మాత ధనరాజ్. ప్రతి సీన్ తనకు డీటైల్డ్‌గా నేరేట్ చేసి.. ముందుగా తనతో రీ-రికార్డింగ్ చేయించుకొని.. ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లారని.. ఈ చిత్రానికి పని చేయడం తనకెంతో గర్వంగా ఉందని సంగీత దర్శకుడు బోలే శావలి అన్నారు. ధనలక్ష్మి తలుపు తడితే` వంటి మంచి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని మనోజ్‌నందం, అనిల్ కళ్యాణ్, విజయ్‌సాయి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments