ఈనెల 31న వస్తున్న 'ధనలక్ష్మి తలుపు తడితే'

  • IndiaGlitz, [Thursday,July 23 2015]

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో సాయి అచ్యుత్‌ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ధనరాజ్‌, మనోజ్‌నందం, అనిల్‌ కళ్యాణ్‌, విజయసాయి, రణధీర్‌, శ్రీముఖి, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్‌ ముఖ్య తారాగణంగా భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మల‌పల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ధనల‌క్ష్మి తలుపు తడితే' చిత్రం సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసుకొని ఈనెల‌ 31న ప్రేక్షకుల‌ ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

బోలే శావలి సంగీత సారధ్యంలో రూపొంది మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియోకు విశేషమైన స్పందన వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ నిర్వహించారు.

ఈ వేడుకలో యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, సీనియర్‌ నటు నరేష్‌, తెలంగాణ సాంస్కృతిక శాఖాధిపతి రసమయి బాల‌కిషన్‌, ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త గొట్టిముక్కల‌ పద్మారావు, అంబికా కృష్ణ, నిర్మాత మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌, ప్రముఖ నిర్మాత వ‌ల్లూరి ర‌మేష్, పద్మిని తదితరుల‌తోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ చిత్రంలోని పాటల‌ను ప్రదర్శించారు. ఎంతో ఇష్టంగా కష్టపడి, అత్యంత బాధ్యతాయుతంగా నిర్మించిన ధనల‌క్ష్మి తలుపు తడితే' చిత్రం అందరినీ అమితంగా అల‌రిస్తుందని, ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్‌ క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ ఇచ్చిందని.. ఈనెల‌ 31న ఈ చిత్రాన్ని విడుదల‌ చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మాత తుమ్మల‌పల్లి రామసత్యనారాయణ ప్రకటించారు.

చిన్న చిత్రంగా విడుదవుతున్న ధనల‌క్ష్మి తలుపు తడితే' పెద్ద విజయం సాధించి.. ఈ చిత్రంతో అసోసియేట్‌ అయిన ప్రతి ఒక్కరి ఇంటి తలుపు ధనల‌క్ష్మి తట్టాల‌ని అతిథులంతా అభిల‌షించారు. ధనల‌క్ష్మి తలుపు తడితే' అద్భుతంగా రూపొందిందని.. కచ్చితంగా వంద రోజులాడుతుందని నేను చెప్పను. కానీ.. విడుదలైన అన్ని ధియేటర్లలో రెండో వారం కొనసాగుతుందని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగను' అన్నారు నటుడు,నిర్మాత ధనరాజ్‌. ప్రతి సీన్‌ తనకు డీటైల్డ్‌గా నేరేట్‌ చేసి.. ముందుగా తనతో రీ-రికార్డింగ్‌ చేయించుకొని.. ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లారని.. ఈ చిత్రానికి పని చేయడం తనకెంతో గర్వంగా ఉందని సంగీత దర్శకుడు బోలే శావలి అన్నారు. ధనల‌క్ష్మి తలుపు తడితే' వంటి మంచి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని మనోజ్‌నందం, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌సాయి అన్నారు.

More News

It's official! Baahubali enters Guinness records

Recently, the distribution wing of ‘Baahubali’ (Malayalam version) erected the huge movie poster (4,793.65 sq mts) in Kerala for the film’s audio launch. The poster turned out to be the world's largest and has entered the Guinness Book of World Records.

Ajith and Shruti's Roles in 'Thala 56' Exposed

‘Thala 56’ directed by Siruthai Siva and starring Ajith, Lakshmi Menon, Shruti Haasan, Ashwin Kakkamanu and Soori among others is on its last leg of shooting in Kolkata...

Shruti Haasan is not a taxi driver

There has been a speculation that Shruti Haasan will be seen as a taxi driver in Ajith's 56th film, which is being directed by Shiva of 'Shouryam' fame. But contrary to the rumours, she is playing a lawyer and it is Ajith, who is playing a cab driver in the film. Some sources have confirmed it.

Dhanush's Three Getups in Next Movie

Though 'Maari' was panned by critics, the film has become the highest grosser in the career of Dhanush. The busy actor is on the verge of completing 'VIP2' directed by Velraj in which he shares screen space with Samantha and Amy Jackson.....

Pawan Kalyan's next is titled Sardar?

The buzz surrounding Pawan Kalyan’s next film Gabbar Singh 2 (working title) has gotten bigger. The latest we hear the makers are contemplating the title ‘Sardar’ for the action drama. Featuring Pawan in yet another intense role, the breezy entertainer will enthrall fans and audience with trademark powestar’s antics and unique content.