సెన్సార్ కి వెళ్తున్న ధనలక్ష్మి

  • IndiaGlitz, [Thursday,July 09 2015]

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై.. యువ ప్రతిభాశాలి సాయి అచ్యుత్‌ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ధనలక్ష్మి తలుపు తడితే'. ధనరాజ్, మనోజ్ నందం, విజయ్ సాయి, రణధీర్, అనిల్ కళ్యాణ్, శ్రీముఖి, నాగబాబు, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. సెన్సార్ కు సిద్ధమైంది.

బోలే శావలి సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సన్నాహాలు చేసుకొంటున్నారు.
ఈ సందర్భంగా ...

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... "కథ-కథనాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం "ధనలక్ష్మి తలుపు తడితే". పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెన్సార్ పూర్తవ్వగానే చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తామన్నది తెలియజేస్తాం" అన్నారు.