'ధనాధన్ ' విడుదలకు సిద్ధం

  • IndiaGlitz, [Monday,December 14 2015]

వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా థర్డ్ ఐ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ వారి బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ నిర్మించిన 'ధనాధన్' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

చిత్ర నిర్మాతలు డా|| శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని మాట్లాడుతూ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి తన ఉద్యోగం పోవడం వల్ల తన జీవితంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. తమిళ దర్శకుడు శంకర్ శిష్యుడు శ్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యస్ యస్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హై లైట్ గా నిలుస్తుంది.త్వరలోనే ఆడియోను సోని మ్యూజిక్ ద్వారా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కోటా శ్రీనివాసరావు,షియాజీ షిండే ముఖ్య ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.