'ధనాధన్' పాటలు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా తమిళంలో రూపొందిన 'డమాల్ డుమీల్' చిత్రాన్ని బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై 'ధనాధన్' పేరుతో శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను గురువారం ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగబాబు తొలి సీడీని ఆవిష్కరించి ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా..
నాగబాబు మాట్లాడుతూ.. ''శివ నాకు మంచి టెక్నీషియన్ గా పరిచయం. ఈ సినిమా తీసుకునే ముందు నాకు చెప్పాడు. సరే తీసుకో అన్నాను. పాటలు, ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళ్ లో హిట్టైన ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధించి నిర్మాతగా శివకు మంచి పేరు రావాలి'' అని అన్నారు.
కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ''మొదట ఈ సినిమాకు తమిళ్ లో కమాల్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరే వారు రిజిస్టేషన్ చేయించడంతో 'డమాల్ డుమీల్' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. వైభవ్ కు ఈ సినిమా తమిళ్ లో మంచి పేరు తెచ్చింది. తమిళంలో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి'' అని అన్నారు.
నిర్మాత శివ వై ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఎడిటర్ నుంచి నిర్మాతగా ప్రమోట్ చేస్తున్న రామ సత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు. సినిమా అయితే తీసుకున్నాకానీ క్వాలిటీ గా అనువాద కార్యక్రమాలు చేయాలంటే మరో పార్టనర్ అవసరం అనుకుంటున్న సమయంలో నా మిత్రుడైన శ్రీనివాస్ అనంతనేని ముందుకొచ్చాడు. తను కూడా యాడ్ అవడంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాని స్ట్రెయిట్ సినిమాలా తీర్చిదిద్దాము. ఇక మీదట కూడా ఇద్దరం కలిసి సినిమాలు చేస్తాము. నాగబాబు గారు మాకు ఎంతో సహకరించారు. వైభవ్ గారు అద్భతంగా నటించారు. హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమా రూపొంది తమిళ్ లో మంచి విజయం సాధించింది. మార్చి11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తెలుగులో కూడా పెద్ద సక్సెస్ చేస్తారన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మల్టీ డైమన్షన్ వాసు, సురేష్ కొండేటి, చేతన్, శ్రీ, బెక్కం వేణుగోపాల్, అర్జున్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout