చిత్రీకరణ చివరి దశలో ధమ్కీ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
సుంకర బ్రదర్స్ పతాకంపై భాస్కర రావు శ్రీమతి ఆదిలక్ష్మి సమర్పణలో సత్యనారాయణ సుంకర నిర్మాత గా తెరకెక్కిన చిత్రం ధమ్కీ.. రజిత్, త్రిషాలాషా జంటగా నటించగా ఏనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందింది.. ప్రస్తుతం చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా సినిమా సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్తుంది.. శ్రీమణి సాహిత్యం అందిస్తున్న ఈ సినిమా కి ఎస్.బి ఆనంద్ సంగీతం, దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..
దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ... ధమ్కీ చిత్రం వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం గా చేసుకుని తెరకెక్కిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. ప్రేక్షకులకు ఈ జోనర్ కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇది.. అందరిని సినిమా ఆద్యంతం అలరిస్తుంది.. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నిర్మాత సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంటుంది.. అన్నారు..
నిర్మాత సత్య నారాయణ సుంకర మాట్లాడుతూ... ధమ్కీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ చేస్తాం.. ఈ సినిమా కథ చాల బాగా నచ్చి సినిమా ని ప్రొడ్యూస్ చేశాను.. దర్శకుడు ఏనుగంటి కూడా చాల బాగా తెరకెక్కించారు.. కొన్ని కొన్ని సీన్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయి.. త్వరలో విడుదల తేదీ ని ప్రకటిస్తాం.. అన్నారు..
నటీనటులు : రజిత్, త్రిషాలాష, శ్రవణ్, అజయ్, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, చిత్రం శ్రీను, నల్ల వేణు, బిత్తిరి సత్తి, యోగిన్, బివిఆర్ చౌదరి, మాస్టర్ నిఖిల్...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com