మళ్లీ 'దడ' జోడీ..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్యకు ఇప్పుడు మంచి ఫేజ్ నడుస్తోంది. పెళ్లయ్యాక సతీమణి సమంతతో కలిసి చేసిన తొలి సినిమా 'మజిలీ' ఆయనకు సూపర్ సక్సెస్ ఇచ్చింది. ఈ సమ్మర్లో బెస్ట్ బ్లాక్ బస్టర్‌గా బోణీకొట్టింది. ఈ సినిమా ప్రస్తుతం నాగచైతన్య వెంకీమామలో నటిస్తున్నారు. వెంకటేష్, చైతూ కలిసి చేస్తున్న ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కాశ్మీర్లో జరగనుంది.
దీని తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు చైతే. కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్‌ను నాయికగా అనుకుంటున్నారట. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుంది. కాజల్, చైతూకి ఇది తొలి సినిమా ఏమీ కాదు.
వారిద్దరూ ఇంతకు ముందే కలిసి 'దడ' చేశారు. ఆ సినిమా అస్సలు ఆడలేదు. కానీ ఈ రెండో సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ సినిమాతో పాటు నాగచైతన్య 'మహాసముద్రం' అని ఓ సినిమా చేయబోతున్నారు. దానికి ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com