సీఎం స్క్రీప్ట్‌ను డీజీపీ చదువుతున్నారు: బండి సంజయ్
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కుర్మగూడ డివిజన్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అంతా శివాజీలే కదా.. డూపులు ఎవరూ లేరు కదా.. పక్కా ఓటెయ్యాలి’ అంటూ సరదాగా పేర్కొన్నారు. కుట్రదారుల సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
సీఎం స్క్రిప్ట్‌ను డీజీపీ చదువుతున్నారని.. ఇదో దిక్కుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. సమాచారం ఉంటే అరెస్ట్ చేసి, విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. రోహింగ్యాలను రాష్ట్రం నుంచి తరిమికొడతామన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు సీఎం కుట్ర పన్నారని.. విధ్వంసం సృష్టించి.. ఆ నింద బీజేపీపై మోపాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
కాగా.. గురువారం డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో.. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మతకల్లోలాలు సృష్టించేందుకు విద్రోహక శక్తులు కుట్రలు పన్నాయి. వారి ప్రతి కదలిక మాకు తెలుసు. ఇప్పటికైతే ఇంతకంటే వివరాలు చెప్పలేం. వారిపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోనూ లేం. కానీ.. వారు యాక్షన్‌లోకి దిగేలోపే నిలువరిస్తాం’’ అని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com