పోలవరం: కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి!

  • IndiaGlitz, [Tuesday,September 24 2019]

పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన తర్వాత మరోసారి టీడీపీ-వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరంలో జగన్ చిత్ర విచిత్రాలు చేస్తున్నారని.. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

28 నెలలు ఆలస్యం అవుతుంది!

‘సింగిల్ టెండర్ ద్వారా ఇచ్చిన వెసులుబాటు ఏంటో బయటపెట్టాలి..?. దీనిపై విద్యుత్ శాఖ, ఏపీ జెన్‌కో సమాధానం చెప్పాలి. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం పనులు 28 నెలలు ఆలస్యం అవుతుంది. జలవనరుల మంత్రి లేకుండా సీఎంలు గోదావరి జలాలపై చర్చించారు. రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సమాలోచనలు జరుపుతున్నారు. జాతీయస్థాయిలో జలవనరుల శాఖకు అనేక అవార్డులు వస్తే.. ముఖ్యమంత్రి, మంత్రి చెప్పుకోలేకపోతున్నారు. దాదాపు 35అవార్డులు జలవనరుల శాఖ గత ప్రభుత్వ పనితీరు వల్ల దక్కాయి’ అని దేవినేని చెప్పుకొచ్చారు. అయితే మాజీ మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

మనిషిలో అంతరంగానికి అద్దం పట్టే `మిర్రర్`

ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరుగుతోన్న అకృత్యాల ఆధారంగా   శ్రీ మల్లిఖార్జున మూవీస్ పతాకం పై  రూపొందుతోన్న చిత్రం  `మిర్రర్ `,

5 సార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: సుర్వీన్ చావ్లా

మోహ‌న్‌బాబు, శ‌ర్వానంద్ క‌లిసి న‌టించిన చిత్రం `రాజు మ‌హ‌రాజు` చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన సుర్వీన్ చావ్లా కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించింది.

డిఫ‌రెంట్ టైటిల్‌తో సాయితేజ్‌

ఈ ఏడాది `చిత్ర‌ల‌హ‌రి`తో  స‌క్సెస్ కొట్టాడు సాయితేజ్‌. వ‌రుస సినిమాల‌ను ట్రాక్ ఎక్కిస్తూ వ‌స్తున్నసాయితేజ్, సుబ్బు అనే కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

వివాదంలోకి హీరో విజ‌య్ సినిమా

త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి వివాదాలేం కొత్త కావు..ఆయ‌న ప్ర‌తి సినిమాకు ఏదో ఒక వివాదం న‌డుస్తూనే ఉంటుంది.

'గద్దలకొండగణేష్' చిత్రాన్ని గ్రాండ్ సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ - మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'.