పోలవరం: కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి!
- IndiaGlitz, [Tuesday,September 24 2019]
పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన తర్వాత మరోసారి టీడీపీ-వైసీపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరంలో జగన్ చిత్ర విచిత్రాలు చేస్తున్నారని.. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
28 నెలలు ఆలస్యం అవుతుంది!
‘సింగిల్ టెండర్ ద్వారా ఇచ్చిన వెసులుబాటు ఏంటో బయటపెట్టాలి..?. దీనిపై విద్యుత్ శాఖ, ఏపీ జెన్కో సమాధానం చెప్పాలి. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం పనులు 28 నెలలు ఆలస్యం అవుతుంది. జలవనరుల మంత్రి లేకుండా సీఎంలు గోదావరి జలాలపై చర్చించారు. రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సమాలోచనలు జరుపుతున్నారు. జాతీయస్థాయిలో జలవనరుల శాఖకు అనేక అవార్డులు వస్తే.. ముఖ్యమంత్రి, మంత్రి చెప్పుకోలేకపోతున్నారు. దాదాపు 35అవార్డులు జలవనరుల శాఖ గత ప్రభుత్వ పనితీరు వల్ల దక్కాయి’ అని దేవినేని చెప్పుకొచ్చారు. అయితే మాజీ మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.