దేవిశ్రీకి తప్పలేదు
Send us your feedback to audioarticles@vaarta.com
అదేంటో.. కొన్ని సెంటిమెంట్లు వద్దన్నా వెంటాడుతూనే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్‌కి అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తెలుగులో చేసిన సీక్వెల్స్ ఏవీ అచ్చిరావన్నది. ముఖ్యంగా మెగాహీరోలతో చేసినవి. ఇది 'సర్దార్ గబ్బర్‌సింగ్' విషయంలో మరోసారి రుజువైంది. ఇదివరకు చిరంజీవితో 'శంకరదాదా ఎం.బి.బి.ఎస్' అనే హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చేసిన 'శంకర్ దాదా జిందాబాద్' డిజప్పాయింట్ చేస్తే.. అదే వరుసలో అల్లు అర్జున్‌తో 'ఆర్య' అనే హిట్ ఫిల్మ్ కి సీక్వెల్‌గా చేసిన 'ఆర్య 2' నిరాశపరిచింది.
ఇదే వరుసలో పవన్‌తో 'గబ్బర్ సింగ్' వంటి విజయవంతమైన చిత్రం తరువాత చేసిన 'సర్దార్ గబ్బర్ సింగ్' అనే సీక్వెల్ కూడా అదే బాటలో పయనిస్తోందిప్పుడు. దీంతో దేవిశ్రీ తెలుగులో సీక్వెల్ చిత్రాలకు సంగీతమందిస్తే అవి ఆడవు అనే ముద్ర బలంగా పడిపోయినట్లయ్యింది. అయితే.. తమిళంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. సూర్యతో 'సింగం' (యముడు)కి సీక్వెల్ గా 'సింగం 2' చేస్తే అది బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments