అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే.. పలు సూపర్ హిట్ సాంగ్స్ గుర్తుకురాక మానవు. వీరి కాంబినేషన్లో వచ్చిన జల్సా`, జులాయి`, అత్తారింటికి దారేది`, సన్నాఫ్ సత్యమూర్తి` సినిమాలోని పాటలు ఎంత ఘన విజయాన్ని సాధించాయో వేరేగా చెప్పనక్కర్లేదు. అయితే కారణాలేమైనా గత కొంతకాలంగా వీరిమధ్య దూరం పెరిగింది. త్రివిక్రమ్ గత సినిమాలు అఆ`,అజ్ఞాతవాసి` కి వేరే సంగీత దర్శకులు పనిచేశారు. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న చిత్రానికి.. మళ్ళీ దేవిశ్రీని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం.
తొలుత అనిరుధ్‌ని ఈ ప్రాజెక్ట్‌కి ఎంచుకున్నా.. అజ్ఞాతవాసి ఫలితం చూశాక.. ఎన్టీఆర్ సూచన మేరకు త్రివిక్రమ్ఇప్పుడీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ని సెలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఎన్టీఆర్‌కి దేవిశ్రీ మ్యూజిక్ మీద మంచి గురి. వీరి కాంబినేషన్లో వచ్చిన అదుర్స్`, ఊసరవెల్లి`, నాన్నకు ప్రేమతో`, జనతా గారేజ్`, జైలవకుశ` సినిమాలు పాటల పరంగా మంచి విజయాన్ని సాధించాయి. ఏదేమైనా ఆఖరికి విజయాన్ని అందుకోవడమే పరమావధి. అందుకే సూపర్ హిట్ కాంబినేషన్ ని మార్చకూదదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఈ సలహా ఇచ్చినట్టున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన టీం మొత్తాన్ని కూడా మారుస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా వుంటే...ఫిబ్రవరి మూడవ వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments