అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేష‌న్‌ అంటే.. ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్ గుర్తుకురాక మాన‌వు. వీరి కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ జల్సా', జులాయి', అత్తారింటికి దారేది', సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమాలోని పాటలు ఎంత ఘన విజయాన్ని సాధించాయో వేరేగా చెప్పనక్కర్లేదు. అయితే కారణాలేమైనా గత కొంతకాలంగా వీరిమధ్య దూరం పెరిగింది. త్రివిక్రమ్ గత సినిమాలు అఆ',అజ్ఞాతవాసి' కి వేరే సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేశారు. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న చిత్రానికి.. మళ్ళీ దేవిశ్రీని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం.

తొలుత అనిరుధ్‌ని ఈ ప్రాజెక్ట్‌కి ఎంచుకున్నా.. అజ్ఞాత‌వాసి ఫ‌లితం చూశాక‌.. ఎన్టీఆర్ సూచ‌న మేర‌కు త్రివిక్రమ్ఇప్పుడీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ని సెలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఎన్టీఆర్‌కి దేవిశ్రీ మ్యూజిక్ మీద మంచి గురి. వీరి కాంబినేషన్లో వచ్చిన అదుర్స్', ఊసరవెల్లి', నాన్నకు ప్రేమతో', జనతా గారేజ్', జైలవకుశ' సినిమాలు పాటల పరంగా మంచి విజయాన్ని సాధించాయి. ఏదేమైనా ఆఖరికి విజయాన్ని అందుకోవడమే పరమావధి. అందుకే సూపర్ హిట్ కాంబినేషన్ ని మార్చకూదదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఈ సలహా ఇచ్చినట్టున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తన టీం మొత్తాన్ని కూడా మారుస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా వుంటే...ఫిబ్రవరి మూడవ వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారు.

More News

రానాకి కథ చెప్పిన సీనియర్ డైరెక్టర్

‘బాహుబలి’సిరీస్ ఇచ్చిన విజయంతో వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు ఎంచుకుంటున్నాడు యంగ్ హీరో దగ్గుబాటి రానా.

కణం వాయిదా పడిందా?

ఫిదా చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మలర్ బ్యూటీ సాయిపల్లవి..

కృష్ణకుమారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు - డా.మంచు మోహన్ బాబు

"నేను కృష్ణకుమారిగారితో కలిసి నటించకపోయినా ఆమెతోపాటు మాత్రమే కాక ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది.

వినాయక్ గారి ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎలిమెంట్స్ తో ఎనర్జిటిక్ గా ఉండే 'ఇంటిలిజెంట్ ' - సి.కల్యాణ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.

భరతవర్ష క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం

భరతవర్ష క్రియేషన్స్ పతాకంపై నూతన నటీ నటులతో చెన్నకుని శెట్టి(కుమార్)దర్శకత్వంలో