మళ్ళీ రిపీట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. పలువురు దర్శకులు, నిర్మాతలు, కథానాయకులకు ఈ సంగీత దర్శకుడు హాట్ ఫేవరేట్‌గా నిలుస్తున్నారు. అంతేగాకుండా.. వారికి కలిసొస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒకే సంస్థకి వరుసగా మూడు చిత్రాల పరంగా కలిసొచ్చి హ్యాట్రిక్ ఇచ్చిన ఘనతను మరోసారి తన సొంతం చేసుకున్నారు దేవిశ్రీ ప్రసాద్.
కాస్త వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు ఆ సంస్థ కెరీర్ ఆరంభంలో ఆర్య, భద్ర, బొమ్మరిల్లు చిత్రాలకు కలిసొచ్చి హ్యాట్రిక్ అందించారు దేవిశ్రీ ప్రసాద్. కట్ చేస్తే.. చాలా కాలం తరువాత మరో సంస్థకి వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందించారు. ఆ సంస్థే.. మైత్రీ మూవీ మేకర్స్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలతో ఆ సంస్థకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందించిన దేవిశ్రీ ప్రసాద్.. తాజాగా విడుదలైన రంగస్థలం విషయంలోనూ మరోసారి కలిసొచ్చి హ్యాట్రిక్ అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com