అక్టోబర్ లో 'దేవిశ్రీ ప్రసాద్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్.ఒ.క్రియేషన్స్, యశ్వంత్ మూవీస్ పతాకాలపై సంయుక్తంగా భూపాల్, మనోజ్ నందన్,పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం `దేవిశ్రీ ప్రసాద్`. సశేషం, భూ చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ను డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించారు. ఇందులో ప్రముఖ కమెడియన్ ధనరాజ్ కీలక పాత్రలో నటించారు. సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ....
చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ - ``మా దేవిశ్రీప్రసాద్ చిత్రంలో ప్రతి సన్నివేశంతో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రధానంగా మనోజ్ నందన్, భూపాల్, ధనరాజ్, పూజా రామచంద్రన్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్‌లో ప్రతి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. అల్రెడి విడుదలైన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ టీజర్‌ను టెన్ మిలియన్ ప్రేక్షకులు వీక్షించారు. ఓ చిన్న సినిమాకు ఇంత ఆదరణ రావడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి మెసేజ్, ఎంటర్టైన్మెంట్తో సినిమా సాగుతుంది. సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments