అమ్మలకు అంకితం: దేవిశ్రీ ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియల్ మేన్’. కరోనా దెబ్బకు దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలందరూ డిఫరెంట్ ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. సందీప్ వంగా స్టార్ట్ చేసిన బీ ద రియల్‌మేన్ ఛాలెంజ్ బాగా వైరల్ అవుతుంది. సందీప్ వంగా, రాజమౌళి, తారక్, చరణ్, కీరవాణి, కొరటాల శివ, సుకుమార్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ఇందులో సుకుమార్ తన స్నేహితుడు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ను ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌ను దేవిశ్రీప్రసాద్ బుధవారం పూర్తి చేశారు.
దేవిశ్రీ బీ ద రియల్ మేన్ ఛాలెంజ్‌ను కాస్త ఫన్నీగా ఎడిట్ చేయించుకున్నారు. తన మేనల్లుడు సత్యతో కలిసి వీడియోలో కనపడ్డ దేవిశ్రీ, సుకుమార్ తనను నామినేట్ చేశాడని తెలియగానే తత్తరపడటం, వెంటనే పనులను చేయడానికి రెడీ అవడం వీడియోలో చూడొచ్చు. ఇంటిపనులను పూర్తి చేసిన దేవి.. తర్వాత అమ్మ కోసం ఓ ఆమ్లెట్ వేశాడు. తర్వాత నాన్న చిత్రపటాన్ని శుభ్రం చేసి, ఆయనకు దణ్ణం పెట్టుకుని తర్వాత అమ్మకు కాఫీ చేసిచ్చాడు. నేను రియల్ మేన్ కాదు.. రియల్‌మేన్స్‌ను అందించిన అమ్మలే గ్రేట్ అంటూ వారికి తన వీడియోను అంకితం చేశాడు దేవిశ్రీ ప్రసాద్.
Here’s my #betheREALMAN video Dear SUKU BHAI @aryasukku ??
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 29, 2020
Wit an Entertaining Effort??@imvangasandeep @ssrajamouli @KChiruTweets
Nw I request My Dear Friends@alluarjun @Karthi_Offl @TheNameIsYash @harish2you
&
Our Lalettan
Dear @Mohanlal sir
2 take d Challnge Forwd???? pic.twitter.com/6CnIgFy6P8
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments