టాలెంట్‌తో మెప్పిస్తున్న సుకుమార్ కుమార్తె

  • IndiaGlitz, [Wednesday,January 22 2020]

బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 11. ఆరోజు సుకుమార్ కుమార్తె సుకృతి ఆయ‌న‌కు త‌న పాట పాడి .. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌చేసింది. ఈరోజు(జ‌న‌వ‌రి 22)న సుకృతి పుట్టిన‌రోజు..ఈ సంద‌ర్భంగా సుకృతి పాట పాడిన వీడియోను మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ''డార్టింగ్ సుకుమార్ కుమార్తె సుకృతికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. తండ్రి కోసం ఆమె పాడిన పాట వీడియో విడుద‌ల చేస్తున్నాం. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది'' అని మెసేజ్‌ను కూడా దేవిశ్రీ ప్ర‌సాద్ పోస్ట్ చేశారు. పాట విన్న‌వారంద‌రూ సుకృతి వాయిస్ బావుంద‌ని, ఆమె చాలా టాలెంటెడ్ అని అప్రిషియేట్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ర‌గ్డ్ లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. 'రంగ‌స్థ‌లం' వంటి భారీ స‌క్సెస్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.