అక్కడా దేవిశ్రీ ప్రసాద్‌నే హవా
Send us your feedback to audioarticles@vaarta.com
దేవిశ్రీ ప్రసాద్.. తెలుగు పరిశ్రమలో ఓ సంచలనం. ప్రస్తుతం నెంబర్‌వన్ కథానాయకుడిగా దూసుకుపోతున్న ఈ యువ సంగీత సంచలనం.. తెలుగులో ఈ ఏడాది చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేశాడు. ఖైదీ నెం.150, నేను లోకల్, రారండోయ్ వేడుక చూద్దాం, డిజె, జయజానకి నాయక, జైలవకుశ, ఉన్నది ఒకటే జిందగీ, ఎం.సి.ఎ.. ఇలా 8 చిత్రాలతో దేవి ఈ ఏడాది సందడి చేశాడు.
వాటిలో సగానికి పైగా సినిమాలు హిట్టయ్యాయి కూడా. కాగా, దేవి తాజా చిత్రం ఎం.సి.ఎ ఓవర్సీస్లో మిలియన్ డాలర్ క్లబ్లో ఎంటరైన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో చేరిన 35వ తెలుగు చిత్రమిది. కట్ చేస్తే.. వీటిలో 13 సినిమాలు దేవిశ్రీ ప్రసాద్వే ఉన్నాయి.
ఆ తరువాత థమన్, అనూప్ రూబెన్స్ ఉన్నారు. అయితే వారి స్కోర్ కేవలం నాలుగు చిత్రాలకు పరిమితమైంది. ఏదేమైనా.. దేవిశ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్, భారీ బడ్జెట్ మూవీ ఆఫర్ల విషయంలోనే కాదు ఓవర్సీస్ మిలియన్ డాలర్ క్లబ్లో కూడా ముందున్నాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments