అప్పుడు తమన్.. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
2013 తరువాత మూడేళ్ల గ్యాప్‌తో.. అంటే 2016లో కూడా రెండేసి సినిమాలతో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్. సంక్రాంతి కానుకగా జనవరి 8న 'నాన్నకు ప్రేమతో' కోసం సందడి చేయనున్న ఈ నందమూరి కథానాయకుడు.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమాతో ఆగస్టు 12న పలకరించనున్నాడు. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలకూ దేవిశ్రీ ప్రసాదేనే సంగీతం అందించడం.
ఇదే అనుభవం 2013లోనూ తారక్ విషయంలో ఎదురైంది. ఆ ఏడాదిలో తారక్ హీరోగా వచ్చిన 'బాద్‌షా', 'రామయ్యా వస్తావయ్యా' లకి యువ సంగీత దర్శకుడు తమన్ సంగీతమందించాడు. మొత్తమ్మీద.. ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌తో ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలతో పలకరిస్తుండడం ఎన్టీఆర్ కి ఆనవాయితీగా మారుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments