అప్పుడు త‌మ‌న్‌.. ఇప్పుడు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

2013 త‌రువాత మూడేళ్ల గ్యాప్‌తో.. అంటే 2016లో కూడా రెండేసి సినిమాల‌తో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు ఎన్టీఆర్‌. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న‌ 'నాన్న‌కు ప్రేమ‌తో' కోసం సంద‌డి చేయ‌నున్న ఈ నంద‌మూరి క‌థానాయ‌కుడు.. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సినిమాతో ఆగ‌స్టు 12న ప‌ల‌క‌రించ‌నున్నాడు. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల‌కూ దేవిశ్రీ ప్ర‌సాదేనే సంగీతం అందించ‌డం.

ఇదే అనుభ‌వం 2013లోనూ తార‌క్ విష‌యంలో ఎదురైంది. ఆ ఏడాదిలో తార‌క్ హీరోగా వ‌చ్చిన 'బాద్‌షా', 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' ల‌కి యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంగీత‌మందించాడు. మొత్త‌మ్మీద‌.. ఒకే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ఒకే ఏడాదిలో రెండేసి సినిమాల‌తో ప‌ల‌క‌రిస్తుండ‌డం ఎన్టీఆర్ కి ఆన‌వాయితీగా మారుతోంద‌న్న‌మాట‌.

More News

బ‌న్ని, సాయి బాట‌లో వ‌రుణ్‌

మెగా ఫ్యామిలీ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ 'కంచె'తో డీసెంట్ హిట్ కొట్టాడు. దీంతో అత‌ని త‌దుప‌రి చిత్రం 'లోఫ‌ర్' (పేరు మార్చే అవ‌కాశం ఉంది)పై అంద‌రి దృష్టి ప‌డింది.

మొదట్లో అభ్యంతరం చెప్పినవాళ్లే ఇప్పుడు అభినందిస్తున్నారు : 'ఎఫైర్‌' జంట ప్రశాంతి - గీతాంజలి

తెలుగులో మొట్టమొదటిసారిగా.. ‘ఇద్దరమ్మాయి ప్రేమకథ’గా తెరకెక్కిన ‘ఎఫైర్‌’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

హిట్ కోసం తమన్నాని నమ్ముకున్న హీరో

సెంటిమెంట్ అనేది సామాన్య జనానికీ ఉంటుంది.అదే సినిమా వాళ్లకు అయితే కాస్త ఎక్కువుగా ఉంటుంది.సినిమా సక్సెస్ అయితే నెక్ట్స్ మూవీకి కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతుంటారు.

రాజుగారి గ‌ది స‌క్సెస్ మీట్‌

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా రాజుగారి గ‌ది. చేత‌న్ చీను, పూర్ణ‌, అశ్విన్ బాబు, శ‌క‌ల‌క శంక‌ర్‌, విద్యుల్లేఖ రామ‌న్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

బుల్లెట్ రాణి విశేషాలు

ప్రియాంక కొఠారి కీల‌క పాత్ర‌లో న‌టించిన సినిమా బుల్లెట్ రాణి. ఫోక‌స్ ఆన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందింది. సాజిద్ ఖురేషి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.