ఆ హీరోకి దేవిశ్రీనే లక్కీ మ్యూజిక్ డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
'భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు' అనే బ్రాండ్‌తో హీరోగా తెరంగేట్రం చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. తొలి చిత్రమే ఓ అగ్ర దర్శకుడు, అగ్ర కథానాయికలు, అగ్ర సంగీత దర్శకుడు కాంబినేషన్లో చేసి పాస్ మార్కులు కొట్టేశాడు. ఆ చిత్రమే అల్లుడు శీను. వి.వి.వినాయక్, సమంత, తమన్నా, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా మంచి టీమ్ అతనికి సెట్ అయ్యింది ఆ సినిమాకి. కానీ ఆ తరువాత వచ్చిన రెండో చిత్రం స్పీడున్నోడు మాత్రం అతని స్పీడ్‌కి ఆదిలోనే బ్రేక్ వేసింది.
దీంతో మూడో చిత్రం విషయంలో ఆచితూచి అడుగులేశాడు. ఫలితం.. మరో విజయం అతని ఖాతాలో చేరింది. ఈ సారీ కూడా తొలి చిత్రం మాదిరిగానే అగ్ర దర్శకుడు, టాప్ హీరోయిన్, ఇప్పటి నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో చేశాడు. బోయపాటి శ్రీను దర్శకుడిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ఆ చిత్రమే జయజానకి నాయక. తొలి చిత్రానికి చేసిన దేవిశ్రీనే ఈ సినిమాకీ సంగీత దర్శకుడు. అంటే.. దేవిశ్రీ సంగీతం బెల్లంకొండ శ్రీనివాస్ కి బాగా కలిసొచ్చిందన్నమాట. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం కూడా సెంటిమెంట్‌గా హిట్ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments