దేవిశ్రీ..వరుసగా మూడు నెలలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఖైదీ నెం.150, నేను లోకల్, రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జగన్నాథమ్, జయజానకి నాయక, జై లవకుశ.. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటికే ఆరు క్రేజీ ప్రాజెక్ట్ లతో సందడి చేశాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 27న ఉన్నది ఒకటే జిందగీ అంటూ మరో చిత్రంతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు దేవిశ్రీ. విశేషమేమిటంటే.. ఆగస్టు నెల నుంచి గమనిస్తే.. వరుసగా మూడు నెలలపాటు దేవిశ్రీ ప్రసాద్ సినిమాలు తెరపైకి వస్తున్నాయి.
ఆగస్టులో జయజానకి నాయక ప్రేక్షకుల ముందుకి వస్తే.. సెప్టెంబర్‌లో జైలవకుశ తెరపైకి వచ్చింది. ఇక అక్టోబర్‌లో ఉన్నది ఒకటే జిందగీ రిలీజ్ కాబోతోంది. మొత్తమ్మీద..వరుసగా మూడు నెలల పాటు దేవిశ్రీ ప్రసాద్ సందడి చేశాడన్నమాట. ప్రస్తుతం దేవిశ్రీ.. మహేష్ భరత్ అను నేను, రామ్‌చరణ్ రంగస్థలంతో పాటు హ్యాపీ వెడ్డింగ్, ఎం.సి.ఎ చిత్రాలు చేస్తున్నాడు. ఈ ఏడాదిలో సక్సెస్‌రేట్‌ని బాగానే మెయిన్‌టెయిన్ చేసిన దేవిశ్రీ.. మున్ముందు కూడా అది కొనసాగిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com