మహేష్, సమంత కంటే దేవిశ్రీకే ఎక్కువ
Send us your feedback to audioarticles@vaarta.com
యు.ఎస్.లో తెలుగు సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడం ఇటీవల కాలంలో సాధారణ విషయమైపోయింది. అయితే.. ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది మాత్రం దూకుడు చిత్రమే. మహేష్ బాబు, సమంత జంటగా నటించిన ఈ సినిమా తరువాత.. గడిచిన ఆరున్నరేళ్ళుగా 40 చిత్రాల వరకు ఈ లిస్ట్‌లో చేరిపోయాయి.
ఈ లిస్ట్‌లో ఎక్కువ చిత్రాలు ఉన్న కథానాయకుడిగా మహేష్ బాబుకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటివరకు ఆయన నటించిన 8 సినిమాలు (తాజా చిత్రం భరత్ అనే నేనుతో కలుపుకుని) ఈ క్లబ్లో ఉన్నాయి. ఇక సమంత విషయానికి వస్తే.. తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుని 13 చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
అయితే.. ఈ ఇద్దరి కంటే ఎక్కువ మిలియన్ డాలర్ల సినిమాలు ఉంది మాత్రం.. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కే. ఇప్పటివరకు ఆయన సంగీతంలో రూపొందిన 15 చిత్రాలు ఈ జాబితాలోకి చేరిపోయాయి. ఏదీఏమైనా.. హీరోల్లో మహేష్ బాబు.. హీరోయిన్స్‌లో సమంత.. సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్.. ఈ క్లబ్లో ఎక్కువ చిత్రాలతో టాప్ ప్లేస్‌లో ఉన్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments