'మన్మథుడు'ని ఫాలో అయిపోతున్నదేవిశ్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్‌లో స్థిరపడిన ప్రతి ఒక్కరికీ.. తల్లిదండ్రులతో సహా ప్రతి ఒక్కరి నుంచి ఎదురయ్యే ప్రశ్న 'పెళ్లి ఎప్పుడు?' అనేదే. ఇందుకు టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు తను ఎక్కడికెళ్ళినా ఈ ప్రశ్న పదేపదే ఎదురవుతుందంటున్నాడు ఈ రాక్ స్టార్. అంతేగాకుండా, "పెళ్ళంటే నూరేళ్ళ మంటని...ఆదరా, బాదరా వెళ్లి గోతిలో పడకూడద"ని అనుకుంటున్నారు.
ఏ పాత్రికేయుడైనా పెళ్ళి గురించి ప్రస్తావిస్తే ఆలస్యం, “నేను సుఖంగా వుండడం మీకిష్టం లేదా?” అని చమత్కారంగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు ఈ రాక్ స్టార్. ఇక ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే పెద్ద ప్రాజెక్ట్స్‌తో సందడి చేయనున్నారు దేవిశ్రీ.
ఇప్పటికే తను సంగీతమందించిన 'రంగస్థలం', 'భరత్ అనే నేను' విడుదలకి సిద్ధమవుతుండగా.....రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న మూవీకి, అలాగే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కలయికలో తెరకెక్కబోతున్న సినిమాకి కూడా స్వరాలను సమకూర్చే పనిలో ఉన్నారీ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే పెళ్లి గురించి ఆలోచించే టైం లేకుండా గడుపుతున్నారు. ఏది ఏమైనా పెళ్లి విషయంలో తను సంగీతం అందించిన 'మన్మథుడు' సినిమాలోని 'వద్దురా సోదరా' పాటని బాగానే ఒంటబట్టించుకున్నారు డీఎస్పీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments