కీరవాణి అభిప్రాయానికి భిన్నంగా దేవిశ్రీ ప్రసాద్

  • IndiaGlitz, [Wednesday,August 09 2017]

'బాహుబ‌లి2' విడుద‌ల‌కి ముందు సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అలా సంచ‌ల‌నం సృష్టించిన వ్యాఖ్య‌ల‌లో ఒక‌టి.. వేటూరి, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి వంటి ర‌చ‌యిత‌ల త‌రువాత‌ తెలుగు సినిమా సాహిత్యంలో వెలితి క‌నిపిస్తోంద‌ని. దీనిపై ఈ త‌రం పాట‌ల ర‌చ‌యిత‌లు స్పందించారు కూడా. కాగా..
తాజాగా యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ని ఓ మీడియా సంస్థ ఈ విష‌యం గురించి 'వేటూరి, సిరివెన్నెల త‌రువాత ఏ పాటైనా రాయ‌గ‌లిగే ర‌చ‌యిత‌లు ఇప్పుడున్నారా' అంటూ ప్ర‌స్తావించ‌గా.. 'ఎందుకు లేరండీ.. అంద‌రూ అన్ని ర‌కాల పాట‌లు రాయ‌గ‌లగ‌ల‌రు. రామ‌జోగయ్య శాస్త్రి నాకు అన్ని పాట‌లు రాసిచ్చారు. చంద్ర‌బోస్‌, శ్రీ‌మ‌ణి.. ఇలా చాలామంది ప్ర‌తిభావంతులు ఉన్నారు' అంటూ అభిప్రాయ‌ప‌డ్డారు. అంటే.. కీర‌వాణి అభిప్రాయానికి భిన్నంగా దేవిశ్రీ స్పంద‌న ఉంద‌న్న‌మాట‌.

More News

సునీల్.. అలాంటి రోజుని మిస్సవుతాడా?

హాస్య నటుడుగా తన హవాని చాటుకుంటున్న సమయంలోనే..

స్టార్ హీరోలనే టార్గెట్ చేసుకుంటున్న బోయపాటి

హీరోయిజాన్ని ఎలివేట్ చేసే దర్శకులలో బోయపాటి శ్రీనుది ప్రత్యేక శైలి.

'స్పైడర్ ' టీజర్ రివ్యూ

ఎప్పుడెప్పుడా అని మహేష్ అభిమానులు,ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన స్పైడర్ టీజర్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా

సాయిధరమ్ తేజ్ - వి.వి.వినాయక్ ల భారీ చిత్రం ప్రారంభం

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా,లావణ్య త్రిపాఠి కథానాయికగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్

ప్రతి లవర్ ఓ ఇడియట్ - నవీన్ చంద్ర

నవీన్ చంద్ర,నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'.