కీరవాణి అభిప్రాయానికి భిన్నంగా దేవిశ్రీ ప్రసాద్
- IndiaGlitz, [Wednesday,August 09 2017]
'బాహుబలి2' విడుదలకి ముందు సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలా సంచలనం సృష్టించిన వ్యాఖ్యలలో ఒకటి.. వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి రచయితల తరువాత తెలుగు సినిమా సాహిత్యంలో వెలితి కనిపిస్తోందని. దీనిపై ఈ తరం పాటల రచయితలు స్పందించారు కూడా. కాగా..
తాజాగా యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌ని ఓ మీడియా సంస్థ ఈ విషయం గురించి 'వేటూరి, సిరివెన్నెల తరువాత ఏ పాటైనా రాయగలిగే రచయితలు ఇప్పుడున్నారా' అంటూ ప్రస్తావించగా.. 'ఎందుకు లేరండీ.. అందరూ అన్ని రకాల పాటలు రాయగలగలరు. రామజోగయ్య శాస్త్రి నాకు అన్ని పాటలు రాసిచ్చారు. చంద్రబోస్, శ్రీమణి.. ఇలా చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు' అంటూ అభిప్రాయపడ్డారు. అంటే.. కీరవాణి అభిప్రాయానికి భిన్నంగా దేవిశ్రీ స్పందన ఉందన్నమాట.