అద్భుతం.. మహా శివుడిని క్లిక్ మనిపించిన దేవిశ్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆకాశంలో ఆధ్యాత్మిక అద్భుతం చోటు చేసుకుంది. అది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంట పడింది. ఇంకేముంది వెంటనే తన కెమెరాలో ఆ అద్భుత దృశ్యాన్ని బంధించి అభిమానులతో పంచుకున్నాడు. దేవిశ్రీ ఈ పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే అభిమానులంతా థ్రిల్ ఫీలవుతున్నారు. అంతే కాదు హరహర మహాదేవ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేవిశ్రీ కంట పడింది ఆ సదాశివుడిని ప్రతిభింబించే రూపమే.
ఇదీ చదవండి: మరో డేరింగ్ స్టెప్.. హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్
ఆకాశంలో మేఘాలు అడ్డనామాలుగా కనిపించగా, చంద్రుడు వాటి మధ్యలో ఉన్నాడు. మాహాశివుడే ఆకాశంలో ప్రత్యక్షమైనట్లుగా ఈ రూపం ఉంది. ' ఆకాశంలో శివుడు.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు వస్తున్నాడు' అని దేవిశ్రీ కామెంట్ చేశాడు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కరోనా ఎప్పడు అంతం అవుతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే దేవిశ్రీ నుంచి ఈ ఏడాది ఆసక్తికరమైన చిత్రాలు రానున్నాయి. అల్లు అర్జున్ పుష్ప, రవితేజ ఖిలాడీ, ఎఫ్3 చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హరీష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే రెండవ చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు. గబ్బర్ సింగ్ చిత్రంతో ఈ త్రయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments