బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్ కొట్టిన దేవిశ్రీ ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
దేవిశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. అగ్ర కథానాయకులు, అగ్ర దర్శకులు, అగ్ర నిర్మాణ సంస్థలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయిన దేవిశ్రీ.. గతేడాది 8 సినిమాలతో సందడి చేసి వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే.. కేవలం నాలుగు నెలల గ్యాప్‌లో తన ఖాతాలో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను నమోదు చేసుకున్నారు ఈ యువ సంగీత సంచలనం. కాస్త వివరాల్లోకి వెళితే.. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఎంసీఏతో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న దేవిశ్రీ..
గత నెలలో విడుదలైన రంగస్థలంతో మరో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్నారు. ఇక శుక్రవారం విడుదలైన భరత్ అనే నేనుతోనూ ఆ పరంపరని కొనసాగిస్తున్నారు. తొలి రోజు నుంచే ఈ సినిమాకి బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో.. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నట్లయ్యింది. ప్రస్తుతం.. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను, మహేష్ బాబు - వంశీ పైడిపల్లి, రామ్ 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రాలతో దేవిశ్రీ ప్రసాద్ బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments