దేవిశ్రీ ప్రసాద్ 14.. సమంత 13..
Send us your feedback to audioarticles@vaarta.com
తాజాగా విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో కలుపుకుని కథానాయిక సమంత ఖాతాలో 13 మిలియన్ డాలర్ల క్లబ్ చిత్రాలు ఉండగా.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలో 14 చిత్రాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కాస్త వివరాల్లోకి వెళితే..
‘దూకుడు’తో తొలిసారిగా ఈ క్లబ్‌లో అడుగుపెట్టిన సమంత.. ఆ తర్వాత ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘బ్రహ్మోత్సవం’, ‘అఆ.’, ‘జనతా గ్యారేజ్’, ‘24’, ‘తెరి’, ‘మెర్సల్’, ‘రంగస్థలం’.. ఇలా మొత్తం 13 చిత్రాలతో ఈ క్లబ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. అలాగే.. ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘1 నేనొక్కడినే’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జనతా గ్యారేజ్’, ‘ఖైదీ నంబర్ 150’, ‘దువ్వాడ జగన్నాథమ్’, ‘నేను లోకల్’, ‘జై లవకుశ’, ‘ఎంసీఏ’, ‘రంగస్థలం’.. ఇలా మొత్తం 14 చిత్రాలతో ఈ క్లబ్‌లో మొదటి స్థానంలో నిలిచారు దేవిశ్రీ. వీరిద్దరి మధ్య సాగే ఈ రసవత్తర పోటీలో అంతరం ఒకే ఒక్క అడుగు (ఒకే ఒక్క సినిమా). మరి డీఎస్పీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటారో లేక సమంత ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com