దేవి ఎలిమినేట్.. బాగా గేమ్ ప్లే చేస్తున్న బిగ్‌బాస్..
Send us your feedback to audioarticles@vaarta.com
సన్ డే.. ఫన్ డే కాబట్టి సందడి సందడిగా సాగిపోయింది. ‘మన రికార్డ్ మనమే బ్రేక్ చేసుకుందాం’ టాస్క్‌లో భాగంగా ముందు అభిజిత్.. అమ్మ రాజేశేఖర్‌లు బెలూన్లు పగులగొట్టే టాస్క్ చేశారు. దీనిలో అమ్మ రాజశేఖర్ విజయం సాధించారు. టాయిలెట్ పేపర్లతో టవర్ కట్టే టాస్క్‌ను నాగ్.. లాస్య, దేవికి ఇచ్చారు. ఈ టాస్క్‌లో ఇద్దరూ గెలవలేదు. నెక్ట్స్ కుమార్, సొహైల్.. ఎవరు ఎన్ని స్ట్రాలను వన్ మినిట్‌లో నోట్లో పెట్టుకోగలుగుతారనేది టాస్క్.. దీనిలో కుమార్ సాయి గెలిచాడు. స్వాతి, హారికకు.. ఒక నిమిషంలో ఒక కాలుకి ఎవరెన్ని సాక్సులు తొడుగుతారనేది టాస్క్. హౌస్‌లోని కంటెస్టెంట్‌లంతా స్వాతికి అండగా నిలవడం విశేషం. ఈ టాస్క్‌లో స్వాతి గెలిచింది.
నెక్ట్స్ స్కిప్పింగ్.. మెహబూబ్, అఖిల్‌ల మధ్య. దీనిలో మెహబూబ్ విజయం సాధించాడు. అవినాష్, సుజాతలకు బ్రెడ్ స్లైసెస్ తినడం టాస్క్. అవినాష్ గెలిచాడు. మోనాల్, దివిలకు ఎవరు ఎక్కువ యాపిల్స్ తింటారని టాస్క్. దివి గెలిచింది. నెక్ట్స్ మెహబూబ్‌ని నాగ్ సేవ్ చేశారు. ఆ తరువాత కంటెస్టెంట్లకు గేమ్.. లేడీస్ అండ్ జెంట్స్ రెండు గేమ్స్‌గా విడిపోయి డ్యాన్స్ చేయాలి. నెక్ట్స్ హారికను సేఫ్ జోన్‌లోకి పంపించారు. ఇక నామినేషన్స్‌లో మిగిలింది కుమార్ సాయి, దేవి, అరియానాలు ఉన్నారు. నెక్ట్స్ అరియానాను నాగ్ సేవ్ చేశారు. ఇక కుమార్, దేవిల ముందు బాక్స్ పెట్టారు. దానిలో చెయ్యి పెట్టి బయటకు తీశాక ఎవరి చేతికి ఎరుపు ఉంటే వారు ఎలిమినేట్ అవుతారు. గ్రీన్ ఉంటే వారు సేఫ్. ఫైనల్లీ దేవి చేతికి ఎరుపు ఉంది. దేవి ఎలిమినేట్ అయ్యింది. దీంతో అరియానా బాగా ఎమోషనల్ అయింది. దేవి కూడా బాగా ఎమోషనల్ అవుతుంటే.. అమ్మ రాజశేఖర్ ఓదార్చడం గమనార్హం. అయితే కంటెస్టెంట్లంతా ఏదో ట్విస్ట్ ఉంటుందని భావించారు.
బిగ్‌బాస్ విన్నర్ అవ్వాలనుకున్న దేవి.. మూడవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.. దీనిపై ఏమనుకుంటున్నావని నాగ్ అడిగితే.. తనకు తెలియదని షాక్ అయ్యానని తెలిపింది. అఖిల్ గురించి దేవి చాలా గొప్పగా చెప్పారు. నువ్వేమైనా రాంగ్ రూట్‌లో వెళుతున్నావనిపిస్తే నీకు నువ్వే చెర్నకోలాతో శిక్షించుకోమని చెప్పారు. అభి స్ట్రాంగ్ పిల్లర్ అవుతాడని.. అరియానాకు ఏమైనా నెగిటివ్ థాట్స్ వస్తే డస్ట్ బిన్‌లో వేసెయ్యాలని చెప్పారు. దివికి సోప్, కెమెరాను సుజాతకు ఇచ్చారు. కంటెస్టెంట్లందరి గురించి చాలా బాగా దేవి చెప్పారు. దేవి ‘నువ్వుంటే నా జతగా...’ సాంగ్ పాడారు. చాలా అద్భుతంగా పాడారు. నాగ్ ఇచ్చిన బిగ్‌బాంబ్‌ని దేవి అరియానాపై వేసింది. దేవి వేసిన బిగ్‌బాంబ్‌తో అరియానాను ఈ వారం ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. నిజానికి ఈ వారం దేవి డేంజర్‌లో జోన్‌లో లేరని సర్వే సంస్థల పోలింగ్స్ చెప్పాయి. అయినా దేవి ఎలిమినేట్ అయ్యారు. మరి కాల్ డేటా పరంగా ఏమైనా వెనుకబడి పోయి ఉండొచ్చు. కాగా.. గతవారం కూడా హారికను ఎలిమినేట్ చేసినట్టే చేసి వెనక్కి పిలిచారు. ఇదంతా చూస్తుంటే ఈ మధ్య కంటెస్టెంట్ల కంటే బిగ్‌బాస్ బాగా గేమ్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments