'దేవి' హీరోయిన్ ప్రేమ సెకండ్ మ్యారేజ్ ? భగ్గుమన్న నటి!
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరోయిన్ ప్రేమ సౌత్ లాంగ్వేజెస్ లో 100 కు పైగా చిత్రాల్లో నటించింది. హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైంది. అదే సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా సత్తా చాటింది.
తాజాగా హీరోయిన్ ప్రేమపై ఓ రూమర్ వైరల్ అయింది. ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ప్రేమ భగ్గుమంది. తాను ఒంటరిగా బాగానే ఉన్నానని, ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరింది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ లో ఎలాంటి సత్యం లేదు. ఆ వార్తలు రబిష్ అని ప్రేమ కొట్టిపారేసింది.
ఇదీ చదవండి: శభాష్ పూజా హెగ్డే.. 100 కుటుంబాల కోసం..
ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరి దాంపత్య జీవితం సాఫీగా సాగలేదు. మనస్పర్థలతో 2016లో వీరిద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ప్రేమ ఎక్కడా స్పందించలేదు. ప్రస్తుతం ప్రేమ ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రేమ వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పట్లో ప్రేమ బిజీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేమ నాగదేవతగా నటించిన 'దేవి' చిత్రం ఓ మాస్టర్ పీస్ అని చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com