దేవి ఫైర్.. బిగ్‌బాస్ వచ్చి సారీ చెప్పాలన్న నోయెల్
- IndiaGlitz, [Saturday,September 19 2020]
బిగ్‌బాస్ హౌస్‌లోకి అవినాష్ ఎంట్రీ ఇచ్చాక మంచి జోష్ వచ్చింది. అందిరితో బాగా కలిసిపోయి మొదటి రోజే రాక్ చేశాడు. ఇక ఇవాళ.. అవినాష్ కామెడీ.. కరాటే కల్యాణి పాట.. దేవి ఫైర్.. నోయెల్ సవాల్‌లతో ఆసక్తికరంగా సాగింది. నేటి షో.. అమ్మ రాజశేఖర్ టీం చేసే స్కిట్‌తో షో ప్రారంభమవుతుంది. అయితే వాళ్లు స్కిట్‌కి వాళ్లకు తప్ప ఎవరికీ నవ్వు రాకపోవడమే కామెడీ. నెక్ట్స్ అవినాష్ టీం.. ఆ టాలెంట్‌నంతా అవినాష్ జబర్దస్త్‌లో ఎక్కడ దాచాడో ఏమో కానీ.. బిగ్‌బాస్ షోలో చేసిన స్కిట్‌లో మాత్రం బాగా నవ్వించాడు. గంగవ్వ.. అవినాష్ టీంకి ఓటు వేయడంతో ఆ టీమ్‌కే పాయింట్ ఇచ్చారు. అయితే తన టీంకు పాయింట్ ఇవ్వకపోవడంతో అమ్మ రాజశేఖర్ కాస్త ఇరిటేట్ అయ్యారు. ఈ విషయాన్ని లాస్య.. నోయెల్‌కు చెప్పడంతో అవినాష్ టీం చాలా ఎఫర్ట్ పెట్టి చేశారని నోయెల్ చెప్పాడు. అయితే బిగ్‌బాస్ మాత్రం రెండు టీంలకు రియల్ మ్యాంగో జ్యూస్ పంపించి కూల్ చేశారు.
కరాటే కల్యాణి పాటతో కంటెస్టెంట్లలో హుషారు తెప్పించారు. ఇక నెక్ట్స్ డే ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటతో కంటెస్టెంట్‌లను బిగ్‌బాస్ నిద్ర లేపాడు. ఇక మీరు చేసే ఫుడ్ తిననంటూ దేవి.. సెపరేట్‌గా ఫుడ్ తయారు చేసుకోవడం ప్రారంభించింది. ఎందుకో కానీ దేవి.. గత రెండు రోజులుగా ఇతర కంటెస్టెంట్లతో విభేదిస్తోంది. నామినేషన్స్ తరువాత ఏదో జరిగిందని తనకు తెలుస్తోందని ఫీలయింది. అంతా కలిసి మాట్లాడుకుని తనను అవాయిడ్ చేస్తున్నారంటూ దేవి ఫైర్ అయింది. లాస్య నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. కంటెస్టెంట్లందరూ రూల్స్ బ్రేక్ చేస్తున్నందున బిగ్‌బాస్ పనిష్మెంట్ ఇచ్చారు.
ప్రతిసారి బెల్ మోగినప్పుడల్లా గార్డెన్ ఏరియాలో నిలబడి 20 గుంజీళ్లు తీయాలని బిగ్‌బాస్ పనిష్మెంట్ ఇచ్చారు. బస్తీ మే సవాల్.. బిగ్‌బాస్ వచ్చి సారీ చెప్పాలంటూ నోయెల్ ఫైర్ అయ్యాడు. నాగార్జున సర్‌కి చెప్పి నేను బయటకు వెళ్లిపోతానని చెప్పేశాడు. కంటెస్టెంట్ల ఏకాభిప్రాయం మేరకు నోయెల్ బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. కెప్టెన్ అయిన వెంటనే నోయెల్.. బాధ్యతలు అప్పగించడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూడా దేవి ఇష్యూ స్టార్ట్ చేసింది. ఇక్కడ అమ్మ రాజశేఖర్‌కు, దేవికి మధ్య క్లాష్.. వాయిస్ పెరిగితే ఒప్పుకోనంటూ అమ్మ రాజశేఖర్‌పై దేవి ఫైర్ అయింది. ఆ తరువాత మొనాల్ పేరు చెబుతూ అవినాష్ కామెడీ చేసి అందరినీ నవ్వించాడు. అవినాష్ కామెడీకి మొనాల్ చాలా హర్ట్ అయింది. అవినాష్‌ని పిలిచి అదే విషయాన్ని చెప్పింది. అయితే అంతా రిక్వెస్ట్ చేస్తానే అలా చేశానని అవినాష్ చెప్పాడు. నువ్వలా ప్రతిసారీ నా పేరు తీయడం నచ్చలేదని మొనాల్ చెప్పింది. దీంతో అవినాష్ సారీ చెప్పాడు. ఇక రేపు నాగ్ వచ్చి ఎవరెవరికి క్లాస్ పీకుతారో.. ఎవరెవరికి అప్రిసియేషన్స్ ఇస్తారో వేచి చూడాలి.