శృతి...అదిరింది అంటున్నదేవి..!
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార శృతిహాసన్ తన ఆలోచనలకు బి ది బిట్చ్ అంటూ వీడియో రూపం ఇచ్చింది. నా ఇష్టం వచ్చినట్లు బతకడమే బిట్చ్ అనిపిస్తే అలా పిలిపించుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటుంది శృతి. నా ప్రేమ, నా తప్పులు, నా జీవితం నా ఇష్టం అంటూ ఈ వీడియో ద్వారా ఓ మెసేజ్ ఇచ్చింది. తనకు ఎదురైన అనుభవాల వలనే ఈ వీడియో రూపొందించిదట. శృతి రూపొందించిన ఈ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ వీడియో గురించి సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ స్పందిస్తూ...అద్భుతం అంటూ శృతిహాసన్ ను అభినందించాడు. ఈ వీడియో గురించి శృతి మాట్లాడుతూ... లేడీస్ కి సంబంధించిన టాపిక్స్ గురించి రాయడం అంటే ఇష్టం. అందుకే నా ఆలోచనలను బి ది బిట్చ్ అని వీడియో రూపంలో తీసుకువచ్చాను. ఫ్యూచర్ లో లేడీస్ కి సంబంధించిన మరిన్ని విషయాలు గురించి రాస్తాను. అలాగే వీడియో రూపంలో తీసుకువస్తాను అని తెలియచేసింది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com