వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేయండి: అమూల్‌కు పెటా వినతి
Send us your feedback to audioarticles@vaarta.com
వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) ఇండియా అమూల్ సంస్థని కోరింది. పెటా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ శోధి.. అమూల్‌కు రాసిన లేఖలో మార్కెట్లోకి వేగాన్ ఫుడ్‌తో పాటు పాలను అందుబాటులోకి తేవడం ద్వారా డైరీ సహకార సంస్థలు లబ్ధి పొందవచ్చని సూచించారు. ‘‘డిమాండ్‌తో పోరాడటానికి ప్రయత్నిస్తూ.. వాటంతట అవే పెరిగే మొక్క ఆధారిత వస్తువుల కోసం వనరులను వృథా చేయకుండా.. శాఖహార సంబంధిత ఆహార పదార్థాలను, పాలను మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమూల్ లబ్ధి పొందుతుందని మేము భావిస్తుండటం వల్లే ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ మార్పులపై ఇతర కంపెనీలు స్పందిస్తున్నాయి. అమూల్ కూడా మారాలి ”అని పెటా ఇండియా తెలిపింది.
ఇదీ చదవండి: నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి.. రూ.2 లక్షల జరిమానా..
స్వదేశీ జాగ్రాన్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్వని మహాజన్ చేసిన ఓ ట్వీట్‌పై శోధి స్పందిస్తూ.. ‘‘డైరీ ఫార్మర్స్ చాలా వరకూ పొలం లేని వారేనని మీకు తెలియదా. మీ నమూనాలు వారి జీవనోపాధిని దెబ్బతీయవచ్చు. పాలు అనేవి మన నమ్మకం, మన సంప్రదాయం, మన రుచి, మన ఆహారపు అలవాట్లు, తేలికైన ఆహారంతో పాటు మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే న్యూట్రిషన్’’ అని తెలిపారు. అమూల్ భారతీయ సహకార డైరీ, గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉంది. 1946లో ప్రారంభమైన ఈ డైరీ గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సంఘం నిర్వహిస్తుంది. ప్రస్తుతం గుజరాత్‌లోని దాదాపు 3.6 మిలియన్ పాడి రైతులు ఈ సంస్థలో వాటాదారులుగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments