వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేయండి: అమూల్‌కు పెటా వినతి

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) ఇండియా అమూల్ సంస్థని కోరింది. పెటా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ శోధి.. అమూల్‌కు రాసిన లేఖలో మార్కెట్‌లోకి వేగాన్ ఫుడ్‌తో పాటు పాలను అందుబాటులోకి తేవడం ద్వారా డైరీ సహకార సంస్థలు లబ్ధి పొందవచ్చని సూచించారు. ‘‘డిమాండ్‌తో పోరాడటానికి ప్రయత్నిస్తూ.. వాటంతట అవే పెరిగే మొక్క ఆధారిత వస్తువుల కోసం వనరులను వృథా చేయకుండా.. శాఖహార సంబంధిత ఆహార పదార్థాలను, పాలను మార్కెట్‌లలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమూల్ లబ్ధి పొందుతుందని మేము భావిస్తుండటం వల్లే ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ మార్పులపై ఇతర కంపెనీలు స్పందిస్తున్నాయి. అమూల్ కూడా మారాలి ”అని పెటా ఇండియా తెలిపింది.

ఇదీ చదవండి: నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి.. రూ.2 లక్షల జరిమానా..

స్వదేశీ జాగ్రాన్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్వని మహాజన్ చేసిన ఓ ట్వీట్‌పై శోధి స్పందిస్తూ.. ‘‘డైరీ ఫార్మర్స్‌ చాలా వరకూ పొలం లేని వారేనని మీకు తెలియదా. మీ నమూనాలు వారి జీవనోపాధిని దెబ్బతీయవచ్చు. పాలు అనేవి మన నమ్మకం, మన సంప్రదాయం, మన రుచి, మన ఆహారపు అలవాట్లు, తేలికైన ఆహారంతో పాటు మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే న్యూట్రిషన్’’ అని తెలిపారు. అమూల్ భారతీయ సహకార డైరీ, గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉంది. 1946లో ప్రారంభమైన ఈ డైరీ గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సంఘం నిర్వహిస్తుంది. ప్రస్తుతం గుజరాత్‌లోని దాదాపు 3.6 మిలియన్ పాడి రైతులు ఈ సంస్థలో వాటాదారులుగా ఉన్నారు.

More News

14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు నోటీసులు.. శర్వానంద్ కోపానికి కారణం అదేనా?

యంగ్ హీరో శర్వానంద్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముఖకవళికలతోనే అన్ని భావాలని పలికించగల నటుడు శర్వానంద్.

ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం

ఏపీలో కరోనాకు తొలిసారిగా మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్‌లో కరోనా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ ప్రయోగం నిర్వహించారు.

లెగ్ పీస్ రాలేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. స్పందించాల్సిందేనన్న అసదుద్దీన్..

మంత్రి కేటీఆర్‌కు రోజుకు ఎన్నో విజ్ఞప్తులు సోషల్ మీడియా వేదికగా వెళుతుంటాయి. అప్పుడప్పుడు అభిమానులు ఆయనకు పలు సూచనలు కూడా చేస్తుంటారు.

సుక్కు కథ నిఖిల్ ని కూడా మార్చేసిందే!

టాలీవుడ్ లో ట్యాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. చూడడానికి లవర్ బాయ్ లా కనిపిస్తాడు కానీ మనోడు చేసే ప్రతి చిత్రం విభిన్నంగా ఉంటుంది.

కౌశల్ భార్యకు ఏమైంది.. ఆందోళన కలిగించేలా పోస్ట్ !

బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు విజేత కౌశల్ మందా. బిగ్ బాస్ ముందు వరకు కౌశల్ ఒక సాధారణ నటుడు, మోడల్ మాత్రమే. కానీ బిగ్ బాస్ షో తర్వాత కౌశల్ ఓ హీరోలా మారిపోయాడు.