విజయ్ దేవరకొండతో పవన్ డైరెక్టర్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లిచూపులుతో సోలో హీరోగా తొలి హిట్‌ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన అర్జున్ రెడ్డితోనే పరిశ్రమ దృష్టిలో పడ్డాడు ఈ యువ కథానాయకుడు. ఆ సినిమాలోని తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
సోలో దర్శకుడు పరశురామ్‌తో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న విజయ్.. మహానటిలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అంతేకాకుండా.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు దర్శకుడు క్రాంతి మాధవ్‌తోనూ విజయ్ ఓ చిత్రాన్ని చేసే అవకాశముందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.
ఇదిలా ఉంటే.. రవితేజతో పవర్, పవన్ కళ్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్‌తో జై లవ కుశ చిత్రాలను తెరకెక్కించిన బాబీ దర్శకత్వంలో విజయ్ నటించే అవకాశముందని టాలీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాబీ.. విజయ్‌కి ఓ స్టోరీ లైన్ చెప్పాడని.. విజయ్‌కి అది నచ్చడంతో పూర్తిస్థాయిలో సబ్జెక్ట్ తయారు చేయమని చెప్పాడని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments