విజయ్ దేవరకొండతో పవన్ డైరెక్టర్ ?

  • IndiaGlitz, [Tuesday,October 31 2017]

పెళ్లిచూపులుతో సోలో హీరోగా తొలి హిట్‌ని అందుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయితే ఈ ఏడాది ఆగ‌స్టులో రిలీజైన అర్జున్ రెడ్డితోనే ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డ్డాడు ఈ యువ క‌థానాయ‌కుడు. ఆ సినిమాలోని త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌య్‌.. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సోలో ద‌ర్శ‌కుడు ప‌రశురామ్‌తో ఇప్ప‌టికే ఓ సినిమా చేస్తున్న విజ‌య్‌.. మ‌హాన‌టిలో ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. అంతేకాకుండా.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్‌తోనూ విజ‌య్ ఓ చిత్రాన్ని చేసే అవ‌కాశ‌ముంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి.

ఇదిలా ఉంటే.. ర‌వితేజ‌తో ప‌వ‌ర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, ఎన్టీఆర్‌తో జై ల‌వ కుశ చిత్రాల‌ను తెర‌కెక్కించిన బాబీ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బాబీ.. విజ‌య్‌కి ఓ స్టోరీ లైన్ చెప్పాడ‌ని.. విజ‌య్‌కి అది న‌చ్చ‌డంతో పూర్తిస్థాయిలో స‌బ్జెక్ట్ త‌యారు చేయ‌మ‌ని చెప్పాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం తెలుస్తుంది.

More News

ప‌వ‌న్ హీరోయిన్‌.. ఒకే రోజు రెండు చిత్రాలు

మ‌జ్ను (2016) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. ఆ త‌రువాత కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో ప‌ల‌క‌రించిన ఈ చిన్న‌ది.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా అత‌ని 25వ చిత్రంలో న‌టిస్తోంది.

'క్వీన్' నుంచి తప్పుకుంది

బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. 2014లో విడుదలైన ఈ సినిమాలో కంగనారనౌత్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఇప్పుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

మెట్రో స్మార్ట్ కార్డు ధరెంతో తెలుసా ?

3 కారిడార్లలో నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి తలమానికం కానుంది. నాగోల్ - మెట్టుగూడ 8 కిలో మీటర్ల మార్గం రెండేళ్ల క్రితమే పూర్తయ్యింది.

కాంగ్రెస్ గూటికి రేవంత్

ఎట్టకేలకు రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరారు. తెలుగు దేశం పార్టీ పదవులకు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన నేడు రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

రాశీ ఖ‌న్నా అదుర్స్‌

2014లో విడుద‌లైన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది రాశి ఖ‌న్నా. జోరు నుంచి జైల‌వ‌కుశ వ‌ర‌కు కంటిన్యూగా తెలుగు సినిమాలు చేస్తున్న ఈ సుంద‌రి.. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్‌తో తొలి ప్రేమ‌, ర‌వితేజ‌తో ట‌చ్ చేసి చూడు సినిమాలు చేస్తోంది.