Devara: 'దేవర' షూటింగ్ వీడియో లీక్.. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుత డిజిటల్ కాలంలో లీకులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ మూవీ షూటింగ్ జరిగినా ప్రజలు తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ లీకులు తెలుగు ఇండస్ట్రీని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప2, గేమ్‌ఛేంజర్ మూవీల షూటింగ్‌లోని కొన్ని సీన్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీ షూటింగ్‌కి సంబంధించి ఓ వీడియో ఒకటి లీకై నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతుంది.
ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది. షూటింగ్ జరుగుతుండగా ఎవరో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉంగరాల జుట్టుతో లుంగీ కట్టుకుని భుజంపై కండువా కప్పుకుని తారక్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ వీడియో లీక్ కావడంతో అప్రమత్తమైన మూవీ యూనిట్ అధికారికంగా షూటింగ్‌లో ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసింది.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. మరో సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ ముఖ్యమైన అతిధి పాత్రలో నటిస్తున్నారట. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో మొదటి భాగం 'దేవర పార్ట్-1' దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments