Devara:'దేవర' హిందీ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
Send us your feedback to audioarticles@vaarta.com
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. మరో సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ ముఖ్యమైన అతిధి పాత్రలో నటిస్తున్నారట. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్.
పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మంచి హైప్ నెలకొంది. RRR మూవీతో దేశవ్యాప్తంగా తారక్ క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో ఈ మూవీ నార్త్ థియేట్రికల్ రైట్స్‌ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకడు కరణ్ జోహార్ ఈ నిర్మాణ సంస్థకి యజమాని. గతంలో ఇదే నిర్మాణ సంస్థ 'బాహుబలి' సినిమాని ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లి బ్లాక్‌బాస్టర్ అందుకుంది. ఆ తరువాత ‘ఘాజి’ని కూడా రిలీజ్ చేసి సూపర్ హిట్టుని అందుకుంది. ఇప్పుడు 'దేవర' సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తుంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. దీంతో హైదరాబాద్ సక్సెస్ మీట్‌కు తారక్ హాజరైన మూవీ యూనిట్‌ని అభినందించారు. సింపుల్ డ్రస్‌తో వచ్చిన తారక్.. చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం చాలా రిచ్‌గా కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఆ వాచ్ ధర ఎంత ఉంటుందో అని నెట్టింట తెగ వెతికేసారు. ఈ క్రమంలో దాని రేట్ చూసి షాక్ అవుతున్నారు. అది ‘Audemars Piguet Royal Oak Offshore’ కంపెనీకి చెందిన మోడల్ వాచ్ అని.. ధర అక్షరాలా రూ.1,62,32,657 అని ఉంది. దీంతో ఈ విషయం గురించి మీమ్స్ తెగ వైరల్ చేస్తున్నారు. వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ మొత్తం సెటిల్ అయిపోతుందనే డైలాగులు పెట్టి మీమ్స్ తయారుచేస్తున్నారు.
మరోవైపు ఈ ఈవెంట్‌లో దేవర మూవీ గురించి చెబుతూ మూవీ రిలీజ్ ఆలస్యమైనా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఈ చిత్రం ఉంటుందని ఎన్టీఆర్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2015లో టెంపర్ సినిమా విడుదల సమయంలోనూ ఇక నుంచి నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని తారక్ చెప్పిన డైలాగ్ గుర్తుచేసుకుంటున్నారు. దీంతో అక్టోబర్ 10న విడుదల కానున్న 'దేవర' మూవీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments