దేవా కట్టా.. విష్ణు ఇందూరిల మధ్య రాజుకుంటున్న వివాదం
Send us your feedback to audioarticles@vaarta.com
‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్ట.. నిర్మాత విష్ణు ఇందూరిల మధ్య వివాదం రాజుకుంటోంది. నిర్మాత విష్ణు ఇందూరిపై ట్విట్టర్ వేదికగా దర్శకుడు దేవా కట్ట సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన కథను విష్ణు కాపీ కొట్టి సినిమా తీశారని అయితే అది డిజాస్టర్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై విష్ణు ఇందూరి సైతం ట్విట్టర్లో స్పందించారు. తానే ఆ చిత్రానికి సంబంధించిన ఐడియాను దేవాకు చెప్పానని.. అది ఆయనకు నచ్చిందని.. అంతే కానీ దేవా తనకు ఏ స్టోరీలూ వివరించలేదన్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో దేవా కట్ట స్పందించారు.
2015 అక్టోబర్‌లో ఓ సినిమా రీమేక్ కోసం విష్ణు ఇందూరి తన దగ్గరకు వచ్చారని దేవా తెలిపారు. రీమేక్ సినిమా చేయడం తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి, ‘మహాభారతం’లో ఓ పాయింట్ తీసుకుని ఒక తెలుగుస్టార్, ఒక తమిళ స్టార్‌తో మల్టీస్టారర్ చేద్దామని చెప్పి రెండు ఐడియాలు ఇచ్చానన్నారు. ఆ ఇచ్చిన రెండు ఐడియాల్లో ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ అన్నారు. ఈ బయోపిక్‌ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తీయొచ్చని చెప్పానని.. కథ చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పానన్నారు. మరొకటి.. నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మధ్య స్నేహం, రాజకీయ వైరం గురించి వివరిస్తూ ఫిక్షనల్‌గా ‘గాడ్‌ఫాదర్’లాంటి సినిమా తీయవచ్చని.. ఈ ఇద్దరు నాయకుల అభిమానులు ఒకరిని ఒకరు గౌరవించుకునేలా ఈ కథ ఉంటుందనీ చెప్పానన్నారు. కానీ విష్ణు ఈ రెండు ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపలేదని.. కాంట్రవర్సీ అవుతుందని భయపడ్డారని వెల్లడించారు.
ఇది జరిగిన ఏడాదికి ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటన వచ్చిందన్నారు. అయితే తన తండ్రి గురించి బాలకృష్ణ కంటే ఎవరూ బాగా చెప్పలేరని తాను సైలెంట్ అయిపోయానని దేవా కట్ట వెల్లడిచారు. అయితే ఆ సినిమాను డైరెక్ట్ చేయాలని విష్ణు తనను పిలిస్తే వెళ్లానని.. కానీ బాలయ్య వద్దకు వెళ్లేసరికి తననుకున్న కథ అక్కడ లేదని తెలిపారు. అదే సమయంలో తాను ‘ప్రస్థానం’ రీమేక్ చేస్తుండటంతో సున్నితంగా తిరస్కరించానని వెల్లడించారు. ఒక గొప్ప కథ చిల్లర ప్రాజెక్ట్ కావడం మాత్రం తనకు ఇష్టం లేదన్నారు. విష్ణు ఇందూరిలాగా అబద్ధాలు చెప్పడం కూడా తనకు రాదని దేవా కట్ట పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout