ఘనంగా జరిగిన దేవదాస్ సక్సెస్ మీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, నాని నటించిన దేవదాస్ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. సినిమా యూనిట్ అంతా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. నేను చాలా సూపర్ హిట్ సినిమాలు నిర్మించాను. కానీ ఈ చిత్ర విజయం మాత్రం నాలో చాలా నమ్మకాన్ని పెంచేసింది. కేవలం లాభాల కోసమే సినిమా నిర్మించడం కాకుండా.. దేవదాస్ అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది.
అందుకు చాలా సంతోషంగా ఉంది. నాని, నాగార్జునకు ప్రత్యేకంగా థ్యాంక్స్. వాళ్ల పర్ఫార్మెన్స్ తోనే సినిమా ఈ స్థాయిలో ఉంది. భూపతి రాజా, సాయిమాధవ్ బుర్రా, సత్యానంద్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.. అలాగే మీడియా వాళ్లకు కూడా. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.. అని తెలిపారు.
సినిమాటోగ్రఫర్ స్యామ్ దత్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాత అశ్వినీదత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాగార్జున, నానితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ దసరా శుభాకాంక్షలు అని తెలిపారు.
హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. ఇది నాకు అద్భుతమైన అనుభవం. నాగార్జున గారు.. నానితో నటించడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అశ్వినీదత్ గారికి థ్యాంక్స్ అని తెలిపారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు.. ఇంత విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు అందరికీ థ్యాంక్స్.. ఇంత మంచి అవకాశం అందించినందుకుప్రత్యేకంగా మా నిర్మాత అశ్వినీదత్ గారికి కృతజ్ఞతలు.
ఈ సినిమాకు తమ వంతు సహకారం అందించిన నాగార్జున గారు, నానికి థ్యాంక్యూ. శ్రీధర్ రాఘవన్, సత్యానంద్, భూపతి రాజు గారు ఇచ్చిన సూచనలు కూడా దేవదాస్ సినిమాకు హెల్ప్ అయ్యాయి. నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. అని తెలిపారు.
హీరో నాని మాట్లాడుతూ.. ఈ సినిమాతో నాకు చాలా జ్ఞాపకాలు మిగిలాయి. అన్నింటికంటే ముందు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు నిర్మాత అశ్వినీదత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యూనిట్ ను మరోసారి కలిసినందుకు ఆనందంగా ఉంది.
ఈ అవకాశం కల్పించినందుకు అశ్వినీదత్ గారికి థ్యాంక్యూ. మూడో వారంలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లతో.. మంచి టాక్ తో ముందుకెళ్లడం ఆనందంగా ఉంది. స్వప్న సినిమా నా సినిమాతోనే కమ్ బ్యాక్ కావాలనుకున్నారు.. ఇప్పుడు వైజయంతి మూవీస్ కూడా. నాగ్ అశ్విన్ మరో మంచి సినిమాతో త్వరలోనే వస్తాడని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.
హీరో నాగార్జున మాట్లాడుతూ.. థ్యాంక్స్ చెప్పేముందు అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్ ను ఈ రోజు కలిసాను. నన్ను చూసిన తర్వాత నేను చాలా క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. దేవదాస్ కూడా అలాంటి ఓ మంచి క్వాలిటీ మరియు జాయ్ కలిసిన సినిమా. వైజయంతి మూవీస్ తో పని చేయడం అంటే హోమ్ బ్యానర్ లో పని చేసినట్లే ఉంటుంది.
నేను ఎప్పుడూ చెబుతున్నట్లే నానితో పని చేయడం ఎంజాయ్ చేసాను.. చేస్తాను కూడా. మా నాన్న ఏఎన్నార్, నానికి చాలా పోలికలు ఉన్నాయి. అతడు ఇంకా మంచి విజయాలు అందుకోవాలి. సెట్స్ లో రష్మిక చాలా సరదాగా ఉండేది. ఈ సినిమాకు నా రియల్ హీరో స్యామ్ దత్. అతడి ఓపికకు ఓ దండం పెట్టేయొచ్చు.
అతడి పని చూసి నిజంగా గర్వంగా ఉంది. శ్రీరామ్ ఆదిత్య కూడా చాలా బాగా వర్క్ చేసాడు. సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి అండగా ఉన్న మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే అక్కినేని అభిమానులకు కూడా రుణపడిపోయి ఉంటాను అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com