సెప్టెంబర్ 20న దేవదాస్ ఆడియో పార్టీ..
Send us your feedback to audioarticles@vaarta.com
దేవదాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబర్ 20న జరగనుంది. హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే అద్భుతమైన స్పందన అందుకుంటున్నాయి.
ప్రత్యేకంగా వినాయకచవితి నాడు విడుదలైన లక లక లంకుమికరా పాటకు రెస్పాన్స్ అద్భుతంగా వస్తుంది. ఇక సెప్టెంబర్ 17న నాగార్జున, నాని సినిమాలో తమకు జోడీగా నటించిన హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నల పాత్రలు.. వాళ్ల పేర్లను వాళ్ల వాళ్ల ట్విట్టర్ లో విడుదల చేసి ప్రేక్షకులకు పరిచయం చేసారు.
శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో నరేష్ వికే, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ వయాకమ్ 18 వచ్చి దేవదాస్ కోసం వై జయంతి బ్యానర్ తో టై అప్ కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దేవదాస్ విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com