తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'దేత్తడి' హారిక
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ ఫేం.. ‘దేత్తడి’ హారిక బంపర్ ఆఫర్ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక నియమితులయ్యారు. బిగ్‌బాస్‌తో హారిక చాలా ఫేమస్ అయ్యారు. తన ఆట తీరుతో టాప్ 5కి చేరుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత హారికకు కెరీర్ పరంగా పెద్దగా ఏమీ కలిసి రావడంలేదు అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా హారికకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు.
బిగ్‌బాస్‌కి ముందు తెలంగాణ యాసతో యూట్యూబ్ ద్వారా హారిక బాగానే ఫేమస్ అయ్యారు. ఆ క్రేజ్‌తోనే తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యారు. ప్రారంభం నుంచి తన ఆట తీరుతో ఇతర కంటెస్టెంట్‌లకు గట్టి పోటీ ఇచ్చారు. దీంతో పలుమార్లు నామినేషన్స్‌లోకి వచ్చినా కూడా ఆమె ఎలిమినేట్ అవలేదు. హారిక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఆమె అభిమానులు బాగా పెరిగిపోయారు. దీంతో సునాయాసంగా టాప్ 5కు చేరుకోగలిగారు. కానీ టాప్ 5 నుంచి మొదట నిష్క్రమించిన వ్యక్తి కూడా హారికయే కావడం గమనార్హం. ఆ తరువాత హారికకు పెద్దగా అవకాశాలైతే రాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం మాత్రం మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టింది.
ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ... ప్రస్తుతం తన ప్రయాణం ప్రారంభమే అని.. ఎప్పటికైనా హీరోయిన్‌గా నటించడమే తన లక్ష్యమని తెలిపింది. నగరంలోని మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో సీఈఓ హరికాంత్, డాక్టర్ పూర్ణిమతో పాటు ముఖ్య అతిథిగా దేత్తడి హారిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఒక అమ్మాయిగా తనకెప్పుడూ అమ్మే ఆదర్శమని వెల్లడించింది. ముఖ్యంగా తాను తీసుకునే మంచి నిర్ణయాలే తనకు స్ఫూర్తి అని తెలిపింది. ప్రస్తుతం వరుడు కావలెను అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో చేస్తున్నానని.. అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్‌లో మరో వెబ్ సిరీస్ రానుందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments