నేడు దేత్తడి హారిక బిగ్‌బాస్ నుంచి అవుట్..
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున షోని అంతా తానై నడిపిస్తున్నారు. ఐపీఎల్ ప్రభంజనంలో కూడా అప్రతిహత హవాను చాటారనే చెప్పాలి. ఐపీఎల్‌ను పూర్తిగా నాగ్ డామినేట్ చేసేశారు. అయితే నాగ్ శనివారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించేశారు. దీనిలో భాగంగానే శనివారం కరాటే కల్యాణిని బయటకు పంపించారు. తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు సెల్ఫ్ నామినేట్ అయ్యి కరాటే కల్యాణి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అలా అవకుంటే మరో వారం కొనసాగి ఉండేది. ఇక నిన్నటి షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్లపై నాగ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిపోయారు.
కంటెస్టెంట్లంతా సేఫ్ గేమ్ ఆడి సింపతి కొట్టేయాలనుకుంటున్నారా? అంటూ నాగ్ మండిపడ్డారు. షోకి వచ్చిందెందుకు? నామినేట్ అవకుండా చూసుకోవాల్సింది పోయి.. బిగ్‌బాస్ హెచ్చరించినప్పటికీ ఈ సెల్ఫ్ నామినేషన్స్ ఏంటంటూ నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లందరినీ ఒక ఆట ఆడుకున్నారు. నిన్న నాగ్ ఇచ్చిన స్ట్రోక్‌కి ఇక మీదట హౌస్‌లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ నామినేషన్స్.. సేఫ్ గేమ్స్ అయితే ఉండవు. ఇక ఇవాళ మరో నామినేషన్ ఉండబోతోంది. ఓటింగ్ ప్రకారం చూస్తే అమ్మ రాజశేఖర్ నామినేట్ అవ్వాలి. కానీ షాకింగ్‌గా దేత్తడి హారిక నామినేట్ అవబోతోందని సమాచారం.
అయితే దేత్తడి హారిక ఎలిమినేషన్ రియల్ కాదు.. ఫేక్ నామినేషన్ అని తెలుస్తోంది. సీజన్ 3లో ఒకసారి రాహుల్‌ని ఎలిమినేట్ చేశారు కదా.. ఫేక్ ఎలిమినేషన్. ఆ తరహాలోనే ప్రస్తుతం తిరిగి ఎలిమినేట్ చేయబోతున్నారని సమాచారం. రాహుల్‌ని సీక్రెట్ రూమ్‌లో ఉంచినట్టుగానే.. ప్రస్తుతం దేత్తడి హారికను కూడా సీక్రెట్ రూమ్‌లో ఉంచి గేమ్ ఆడించబోతున్నారని తెలుస్తోంది. మరి అప్పుడంటే ఆ ప్రయోగం బాగానే సక్సెస్ అయింది. అక్కడ ఉన్నది రాహుల్ కాబట్టి అద్భుతంగా నడిచింది. రాహుల్ అంత క్రేజ్ అయితే దేత్తడి హారికకు లేదనే చెప్పాలి. మరి ఆమెను తీసుకెళ్లి సీక్రెట్ రూమ్‌లో ఉంచి గేమ్ ఆడిస్తే ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. లేదంటే నిజంగానే ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతారా? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments