'సొగ్గాడే చిన్ని నాయనా'లో నాగ్ క్యారెక్టర్స్ వివరాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
మనం వంటి క్లాసికల్ హిట్ మూవీ తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సొగ్గాడే చిన్ని నాయనా` అనే సినిమాకి రెడీ అయ్యాడు. సినిమా ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ నాగ్ చాలా నింపాదిగా ఆ సినిమాని పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ్ తండ్రి కొడుకులుగా కనపడతాడు. తండ్రి యాక్టివ్ గా చలాకీగా ఉంటే, కొడుకు విదేశాల్లో చదువుకున్న డాక్టర్ అమాయకుడు. తండ్రికి రమ్యకృష్ణ జోడిగా నటిస్తే, కొడుకు సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుందట. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో తండ్రి పాత్రలో నాగ్ ఆత్మగా కనపడతాడట. కేవలం కొడుకైన మరో నాగార్జున కనపడుతుంటాడట. హిలేరియస్ ఎంటర్ టైనింగ్ సినిమా ఉంటుందని నాగ్ ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments