కబాలి ప్రీమియర్ షో డీటైల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. యువ దర్శకుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కలైఫులి థాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న కబాలి రిలీజ్ డేట్ తెలిసింది. మలేషియాలో ఉన్న రజనీ అభిమానులు ఈనెల 21న కబాలి ప్రీమియర్ షో చూడనున్నారు. ఈ విషయాన్నిమలేషియాలో ప్రకటించారు. ప్రీమియర్ షో టిక్కెట్స్ కూడా బయటకు వచ్చాయి. ఈనెల 21 రాత్రి 9 గంటలకు మలేషియాలోని ఓ ప్రముఖ ధియేటర్ లో కబాలి ప్రీమియర్ షో వేయనున్నారు. అక్కడ ఒక్కో టిక్కెట్ 100 రింగిట్స్ కు విక్రయిస్తున్నారు. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న ప్రీమియర్ షో వేయనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కలైఫులి థాను త్వరలో ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com